వాహ్ రేవంత్! వాహ్.. నీ ఇగో, అసమర్థపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావ్ : కేటీఆర్ విమర్శలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-28 13:14:08  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎల్ అండ్ టీ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం వారు చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు.

వాహ్ రేవంత్! వాహ్.. నీ ఇగో, అసమర్థపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావ్ : కేటీఆర్ విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో తెలంగాణ బాధపడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఒక వ్యక్తి అసమర్థతో తెలంగాణ బాధపడుతోందని పేర్కొన్నారు.

"వాహ్ రేవంత్.. వాహ్.. మళ్లీ తెలంగాణ అభివృద్ధిని పట్టాలు తప్పేలా చేయడం నీకే సాధ్యమైంది. నీ అసమర్థ పాలన, అనవసరమైన అహమే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. గతంలో ఎల్అండ్ టీ సీఎఫ్ఓను జైలుకు పంపాలనిపోలీసుల్ని కోరినట్లు నేషనల్ టెలివిజన్లో గొప్పలు చెప్పుకున్నావని విమర్శించారు. సొంత రియల్ ఎస్టేట్ అవసరాల కోసం.. అసలు ఉనికిలోనే లేని ఫోర్త్ సిటీ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ ను అకస్మాత్తుగా రద్దు చేశావని మండిపడ్డారు.

పేలవమైన రాజకీయ కథనాలు, కమీషన్ల కోసం మేడిగడ్డలో ఎల్ అండ్ టీ వంటి పెద్ద సంస్థను కేసులతో బెదిరించావని రేవంత్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎల్ అండ్ టీ పేరును బురదలోకి లాగి నాశనం చేసేందుకు ప్రయత్నించగా.. వాళ్లు అదృష్టవశాత్తు నీ చెర నుంచి బయటపడుతున్నారన్నారు. మిగతావారిలా ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరంలేకుండా.. రాష్ట్రంనుంచి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.

మీ ఇగో, గూండాగార్డిల ఖర్చు రూ.15 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన వేస్తున్నారని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ లో ఉంది. ఆరోగ్యశ్రీ నిలిచిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలు అటకెక్కాయి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఇవన్నీ మీ అసమర్థ పాలనకు నిదర్శనమని కేటీఆర్ .. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Next Story