- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ అక్క కూడా సంతోషంగా లేదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు కురిపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత ఏ మనిషి కూడా సంతోషంగా లేడని అన్నారు. నిన్న మొన్నటి వరకు గీతక్క, సీతక్క, సురేఖ అన్న తప్ప ఎవరూ సంతోషంగా లేరని చెప్పేవాడినని, కానీ ఇప్పుడు సురేఖ అక్క కూడా సంతోషంగా లేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు కురిపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత ఏ మనిషి కూడా సంతోషంగా లేడని అన్నారు. నిన్న మొన్నటి వరకు గీతక్క, సీతక్క, సురేఖ అన్న తప్ప ఎవరూ సంతోషంగా లేరని చెప్పేవాడినని, కానీ ఇప్పుడు సురేఖ అక్క కూడా సంతోషంగా లేదని అన్నారు. వాళ్ల కూతురే ఏడ్చుకుంటూ సురేఖ అక్క సంతోషంగా లేదని చెబుతోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని యూరియా దొరకడం లేదని, కరెంట్ రావడంలేదని, రైతుబంధు రావడం లేదని విమర్శించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తరవాత భూముల ధరలు కూడా పెరిగాయని కానీ ఇప్పుడు మళ్లీ పడిపోయానని అన్నారు. ఎన్నికల ముందు రూ.31వేలు గజం అమ్మానని ఇప్పుడు రూ.19వేలకు గజం అమ్ముతున్నారని చెప్పారు. సెందులాపూర్ అనే గ్రమానికి వెళ్లి రైతులతో మాట్లాడానని కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం రూ.50 లక్షలకు అమ్మితే ఇప్పుడు రూ.21 లక్షలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రం మొత్తంలో ప్రజల ఆస్థి ఎంతలా కరిగిపోయిందో ఆలోచన చేయాలన్నారు.






