- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి..? మంత్రి మీనాక్షి లేఖి వీడియోపై కేటీఆర్ సెటైర్లు
మీడియా ప్రశ్నలకు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంఘటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మీడియా ప్రశ్నలకు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగులు తీసిన సంఘటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్ల చేస్తున్న నిరసనలపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా.. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పరుగుల తీసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇష్యూపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘నేను భాగ్.. మిల్కా.. భాగ్ గురించి విన్నాను.. ఈ భాగ్ మంత్రి భాగ్ ఏంటి? అంటూ సెటైర్లు వేశారు. మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ప్రెస్‌ని, పబ్లిక్‌ని ఎదుర్కొనలేరు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక, రెజ్లర్ల అంశంలో బ్రిజ్‌భూషణ్ తనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఏం జరుగుతుందో చూద్దాం? నా పదవీ కాలం ముగిసింది. నేను దోషిగా తేలితే నన్ను అరెస్టు చేస్తారు. దాంతో సమస్య ఏంటి అంటూ బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించారు.
Also Read..
బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు: మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు






