లోకేష్ నాకు తమ్ముడు లాంటి వాడు కలిస్తే తప్పేంటి: కేటీఆర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-18 08:05:39  IST  )

ఏపీ మంత్రి లోకేష్ తో భేటీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను తాను క‌ల‌వ‌లేద‌ని అన్నారు. లోకేష్‌ను అర్ద‌రాత్రి క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏంటని..

లోకేష్ నాకు తమ్ముడు లాంటి వాడు కలిస్తే తప్పేంటి: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి లోకేష్ తో భేటీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను తాను క‌ల‌వ‌లేద‌ని అన్నారు. లోకేష్‌ను అర్ద‌రాత్రి క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏంటని.. కావాలంటే ప‌గ‌లే క‌లుస్తాన‌ని అన్నారు. లోకేష్ తనకు త‌మ్ముడి లాంటి వాడ‌ని, అత‌డితో స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని చెప్పారు. అయినా క‌లిస్తే త‌ప్పేంటని ప్ర‌శ్నించారు. లోకేష్ చ‌దువుకున్న యువ‌కుడు, మంచివాడని అన్నారు. ఆయన మీ పెద్ద బాస్ చంద్రబాబు కుమారుడే కదా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు చంద్ర‌బాబుకు.. నిధులు రాహుల్ గాంధీకి వెళుతున్నాయ‌ని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక పొంగులేటికి కాంట్రాక్టులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శించారు. కొడంగ‌ల్ లిఫ్ట్ ఇరిగేష‌న్ లో రూ.4వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారన్నారు. పొంగులేటి ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డినా ఈడీ ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. ఏ అనుమతితో బనకర్ల కడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఏ రైతు క్షేత్రానికి వెళ్లినా రైతులు నిలదీస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి తనకు ఏ సవాల్, ఎక్కడ చేసినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ ఏమైందని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజం లేదని అన్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటున్నారు.. మైక్ కట్ చేయకుంటే చర్చకు సిద్ధమని చెప్పారు. రేవంత్ రెడ్డిని మానసిక ఆస్పత్రిలో చేర్పించాలని ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంతకాలం ఆరోపణలు చేస్తారని, హామీల అమలు సంగతి ఏంటని ప్రశ్నించారు. దుబాయ్ లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం అని మండిపడ్డారు. బనకచర్లపై చర్చించామని మంత్రి నిమ్మల చెబుతుంటే, చర్చించలేదని రేవంత్ అంటున్నారని చెప్పారు. చంద్రబాబుతో రహస్య ఒప్పందం బయటపడటంతోనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి నిలదీస్తూనే ఉంటామని చెప్పారు.

Next Story