కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్ట్ ఆదేశం.. సత్యమేవ జయతే అన్న కేటీఆర్

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాని మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్ట్ ఆదేశం.. సత్యమేవ జయతే అన్న కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాని మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా కోర్టు ఆదేశాలపై కేటీఆర్ స్పందించారు. ఇ మేరకు సత్యమేవ జయతే అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నిజాలు ఎప్పుడైనా బయటపడతాయి. వెంటనే కాకపోయినా చివరికి అయినా బయటపడక తప్పదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్థంలేని దుష్ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారు తప్పించుకోలేరని తెలిపారు.

ప్రజలు అధికారం కట్టబెట్టింది వారి జీవితాలను బజారుకు లాగడానికి కాదన్నారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశమని, అంతేగాని పుకార్లు పుట్టించడానికి, ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల పేరుతో విషం చిమ్మి తప్పించుకోగలమని భావించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక గట్టి గుణపాఠంగా ఉపయోగపడుతుందని తాను ఆశిస్తున్నానన్నారు. తాను చేస్తున్నది సుదీర్ఘ యుద్ధమని, ప్రస్తుతం సగం దూరంలోనే ఉన్నానని, గెలిచేదాకా పోరాడుతూనే ఉంటానని కేటీఆర్ ట్వీట్ చేసారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో, హీరోయిన్ సమంత కేసులో కొండా సురేఖ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించిందని, ఆమె మిడ్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ గత అక్టోబర్లో నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్ట్.. ఈనెల 21 లోగా కొండా సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ.. ఆమెకు నోటీసులు జారీ చేయాలని పేర్కొంది.

Next Story