- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని పీవీ గాడిన పెట్టారు: కేటీఆర్
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నెక్లెస్‌రోడ్‌లోని పీవీ విగ్రహం వద్ద నివాళ్లు అర్పించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పీవీ నరసింహా రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అప్పుల్లో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీది అని కొనియాడారు. పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ఆయన ఎంతో సేవ చేశారని, కానీ ఆ పార్టీ పీవీకి తీరని అన్యాయం చేసిందని గుర్తుచేశారు.
Next Story






