Dallas: డల్లాస్‌లో కేటీఆర్ సందడి.. బీఆర్ఎస్ శ్రేణులు, ఎన్ఆర్ఐల ఘనస్వాగతం

by Ramesh Naini |

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ చేరుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌కి బీఆర్‌ఎస్‌ ఎన్నారై యూఎస్‌ఏ విభాగ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

Dallas: డల్లాస్‌లో కేటీఆర్ సందడి.. బీఆర్ఎస్ శ్రేణులు, ఎన్ఆర్ఐల ఘనస్వాగతం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ (Dallas) చేరుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌కి బీఆర్‌ఎస్‌ ఎన్నారై (NRIs) యూఎస్‌ఏ విభాగ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు, పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్‌‌‌కు విషెస్ తెలియజేశారు. అమెరికాలోని డల్లాస్‌లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఇవాళ (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు డల్లాస్‌లో డాక్టర్‌ పెప్పర్‌ ఎరినా ప్రాంగణంలో జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానున్నారు.

ఇందులో భాగంగా తన రెండు రోజుల లండన్ పర్యటన ముగించుకున్న కేటీఆర్ తాజాగా డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలు ఉన్నారు. పటిష్ట భద్రత నడుమ ప్రత్యేక కాన్యాయ్‌లో కేటీఆర్‌ను తన విడిదికి తీసుకెళ్లారు.

Next Story