KTR: ఆ దేవుడే కాపాడుతాడు.. కేసీఆర్ కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-21 08:02:56  IST  )

ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

KTR: ఆ దేవుడే కాపాడుతాడు.. కేసీఆర్ కు నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలి నోటీసులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు (KCR) కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని కానీ ప్రజలకు వాస్తవాలేంటో తెలుసన్నారు. మాకు చట్టాల మీద విశ్వాసం ఉందని ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కమిషన్లు, కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కాలయాపన, ఇచ్చిన హామీలనుపై ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ దూది పింజల్లా తేలిపోతాయన్నారు. ముమ్మాటికి న్యాయం, ధర్మం గెలుస్తుందని తెలంగాణకు మేలు చేసిన వారిని ఆ దేవుడు కాపాడుతారని చెప్పారు.

ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి:

గత 17 నెలలుగా పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. మీచిల్లర ప్రయత్నాలు ఎక్కువ రోజులు సాగవని తెలంగాణ ప్రజలు తిరుగబడే రోజులు తొందరలోనే వస్తాయన్నారు. కమిషన్‌లు తప్ప ఈ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదన్నారు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే "కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు" అని స్వయంగా చెబుతున్నారన్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేకపోయిందన్నారు. మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారని అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అన్నారు. నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలితే దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు.

Next Story