ఎప్పుడూ చూడని లుక్‌లో కేటీఆర్.. ఫిదా అవుతున్న అభిమానులు

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన రేర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ పూణే యూనివర్సిటీలో చదువుకున్న నాటి ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఎప్పుడూ చూడని లుక్‌లో కేటీఆర్.. ఫిదా అవుతున్న అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన రేర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేటీఆర్ పూణే యూనివర్సిటీలో చదువుకున్న నాటి ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీంతో కుర్రయసులో కేటీఆర్ లుక్ చూసి అభిమానులు, కార్యకర్తలు ఫిదా అవుతున్నారు. కేటీఆర్ కు మీసం లేదని కొందరు విమర్శిస్తున్నారని వాళ్లు ఈ ఫోటో చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా కేటీఆర్ బ్యాచ్ మధ్యలో కూర్చోవడంతో రాజు ఎక్కడున్నా రాజేరా అనే సినిమా డైలాగ్ కొడుతున్నారు.

ప్రస్తుతం ఖద్దర్ దుస్తుల్లో కనిపించే కేటీఆర్ ను టీషర్ట్ జీన్స్ లో చూసి మురిసిపోతున్నారు. ఇక కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన ఇండియాలోనే పూణే యూనివర్సిటీలో సైతం చదువుతున్నారు. అప్పుడప్పుడూ కేటీఆర్ తన స్కూల్, కాలేజీ రోజుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటారు. అయితే రీసెంట్‌గా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి ఒత్తిడిలోనూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం చర్చగా మారింది.

Next Story