బీఆర్ఎస్ నాయకుని కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సహాయం

by Muthe.Rajitha |

పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బీఆర్ఎస్(BRS) నాయకుని కుటుంబానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అండగా నిలిచారు.

బీఆర్ఎస్ నాయకుని కుటుంబానికి కేటీఆర్ ఆర్థిక సహాయం
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ బీఆర్ఎస్(BRS) నాయకుని కుటుంబానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ కార్యకర్త కర్కబోయిన కుంటయ్యకు కుటుంబ సభ్యులను సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో కేటీఆర్ కలిశారు. ఇటీవల పోలీసుల వేధింపులు తట్టుకోలేక కుంటయ్య ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన కుటుంబానికి హామీ ఇచ్చినట్టుగానే తన చిన్న కుమార్తె కు ఫిక్స్డ్ డిపాజిట్ కు ఆర్థిక సహాయం అందించి..పెద్ద కుమార్తె వివాహ పూర్తి బాధ్యత తమదేనని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తోపాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story