మంత్రి హరీశ్ రావుపై కేటీఆర్ ప్రశంసలు

by GSrikanth |

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.

మంత్రి హరీశ్ రావుపై కేటీఆర్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు అవయవాల మార్పిడి ఆపరేషన్లు చేసే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణమని కేటీఆర్‌ అన్నారు. అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటుతోపాటు 1,539 కిడ్నీ, 51 లీవర్‌, అనేక గుండె మార్పిడి ఆపరేషన్లు జరగడం అభినందనీయమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. బరువు తగ్గేందుకు బేరియాట్రిక్‌ సర్జరీలు కూడా చేయడం గొప్పవిషయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story