IYKYK అంటూ ఎక్స్‌లో కేసీఆర్ ఫోటో పోస్ట్ చేసిన కేటీఆర్.. వైరల్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.

IYKYK అంటూ ఎక్స్‌లో కేసీఆర్ ఫోటో పోస్ట్ చేసిన కేటీఆర్.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. కేటీఆర్ ఏదైనా పోస్ట్ చేస్తే అది చర్చనీయాంశం అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆదివారం ఎక్స్ వేదికగా IYKYK ( If You Know, You Know ) అంటూ కేసీఆర్ ఫోటో పోస్ట్ చేశారు. వైరల్ ఫోటోలో కనిపిస్తున్న ప్రకారం.. ఏఐతో రూపొందించిన కేసీఆర్ పార్టీ కండువాతో ఒక కొండపై కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అలాగే కేసీఆర్ పై సూర్యకిరణాలు పడుతున్నాయి. కేసీఆర్ కాళ్ల వద్ద ఒక కుక్క ఉంటుంది.

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏ ఉద్దేశంతో కేటీఆర్ ఈ పోస్ట్ చేశారోనని నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. అన్నా.. ఎవరిని కుక్కతో పోల్చావని నెటిజన్‌లు సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రాణం పోసిన మహనీయుడు కేసీఆర్ అని, పిచ్చికుక్క మొరిగి మొరిగి శాశ్వతంగా మూగబోతుందని మరో నెటిజన్‌ కామెంట్ పెట్టారు. ట్వీట్ ఇదే..

Next Story