- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారే మాపార్టీకి మూల స్తంభాలు.. పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి.. అమరులకు కేటీఆర్ నివాళులు
మా పార్టీ కి, ఆనాడైనా ఈనాడైనా, తెలంగాణనే ఏకైక ఎజెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మా పార్టీ కి, ఆనాడైనా ఈనాడైనా, తెలంగాణనే ఏకైక ఎజెండా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం తెలంగాణ అమరవీరుల స్తూపం (martyrs) తో పాటు ట్యాంక్ బండ్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Lakshman Bapuji), ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) తెలంగాణ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూలస్తంభాలని కొనియాడారు. ఈ మొత్తం 25 ఏళ్ల ప్రస్థానానికి, వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. 25 ఏళ్ల క్రితం, ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో, కేసీఆర్ సారథ్యంలో మా పార్టీ పురుడు పోసుకుందన్నారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, లక్షల మందితో బలోపేతమై, తెలంగాణను సాధించిందన్నారు.
పార్టీ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని, గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి, కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత అండగా నిలిచారన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. 25 ఏళ్లు నిండి, అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో, మరో 25 ఏళ్లు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశించారు.






