KTR : ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌‌తో కీలక భేటీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-15 11:56:43  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాంహౌస్ (Erravelli F కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో కీలకంగా సమావేశమయ్యారు.

KTR : ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌‌తో కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శనివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ (Erravelli Farm House)కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో కీలకంగా సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి, అందుకు గల కారణాలపై కేసీఆర్ తో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా కేటీఆర్, హరీష్ రావులపై చేసిన విమర్శలను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వాటిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కవిత చేసిన విమర్శలపై ఇంతవరకూ కేటీఆర్, హరీష్ రావు స్పందించలేదు. కేసీఆర్ తో భేటీ అనంతరం అయినా కేటీఆర్ ఈ విషయంపై స్పందిస్తారా అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు.

అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో మంగళవారం (నవంబర్ 18) తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశమై జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలపై చర్చించనున్నారు. ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దశలవారిగా పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story