- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తాం.. డల్లాస్‌లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులతో కేటీఆర్
అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరపున ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురి అవుతుందన్నారు. అందుకే విద్యార్థులకు అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే విద్యార్థులు కూడా అమెరికా చట్టాలను అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని కేటీఆర్ సూచించారు.
స్థానిక చట్టాలతో పాటు ఇక్కడి పరిస్థితులను ప్రతీ ఒక్క విద్యార్థి అవగాహన చేసుకోవాలన్నారు. (ఇవాళ) మంగళవారం అమెరికాలోని (University of Texas) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్-డల్లాస్ (Dallas)లో చదువుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమెరికా పోవాలన్నా, చదువుకోవాలన్నా ఎన్నో వ్యయ, ప్రయాసలకు గురయ్యే వాళ్ళమన్న కేటీఆర్, ప్రపంచం వేగంగా మారిపోయి ఇప్పుడు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయన్నాయని, ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు. రిస్కు తీసుకున్నప్పుడు మాత్రమే కలలు సాకారం అవుతాయి అనడానికి కేసీఆర్ జీవితమే సాక్ష్యమని అన్నారు.
రాజకీయాల్లో చిన్న వయసుగా పరిగణించే నాలుగు పదుల వయసులో పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం మొదలుపెట్టిన రోజు అనేకమంది ఆయనను అవహేళన చేశారని చెప్పారు. కానీ 14 ఏళ్ల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు (KCR) కేసీఆర్‌పై ప్రశంసల కురిపించారన్నారు. అమెరికాలో చదువుకుని ఇండియాకి తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కేటీఆర్ కోరారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగం కావాలని పిలుపునిచ్చారు.






