- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. అసెంబ్లీ సెషన్స్, రాజ్యసభ ఎన్నికలపై చర్చ!
ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం ప్రధాన్యతను సంతరించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ (KCR)తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల వ్యూహం..
రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్, కేటీఆర్‌కు దిశానిర్దేశం చేశారు. సంఖ్యాబలం, అభ్యర్థుల ఎంపిక, ఇతర రాజకీయ సమీకరణల చర్చించనున్నారు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి, సభలో పార్టీ గొంతుకను ఎలా బలంగా వినిపించాలనే అంశాలపై కేటీఆర్‌కు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నట్లుగా సమాచారం. చివరగా జిల్లాల వారీగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం లాంటి అంశాలు కూడా ఇవాళ్టి భేటీలో ప్రస్తావనకు వస్తాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.






