- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: జనతా గ్యారేజ్ లా బీఆర్ఎస్ మారింది.. ఎల్కతుర్తిలో కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఎల్కతుర్తి సభా ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ ది అని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజీలా మారిందన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని కేటీఆర్ పరిశీలించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వరంగల్ లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేధికైందన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40 వేల వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, పది లక్షల వాటర్ బాటిల్స్, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలకు అటు వైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది:
ఈ సందర్భంగా పహెల్గం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.






