Jubilee Hills: కేటీఆర్, హరీష్ రావు కీలక సమావేశం

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగనుంది.

Jubilee Hills: కేటీఆర్, హరీష్ రావు కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election) ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిని బట్టి ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ? అంటూ గెలుపు, ఓటములను విశ్లేషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా కౌంటింగ్ ఏజెంట్లతో కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harish Rao) సమావేశం అయ్యారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు, ప్రతి రౌండ్‌లో పాటించాల్సిన విధానాలపై కౌంటింగ్ ఏజెంట్లతో కేటీఆర్, హరీష్‌రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ హాళ్లలో వ్యవహరించే విధానం, EVM–VVPAT పరిశీలన, రౌండ్‌వైజ్‌ డేటా నమోదు, అభ్యంతరాలు ఉన్నపుడు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. రేపటి లెక్కింపు సందర్భంగా పార్టీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని నేతలు సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు రేపే వెలువడనుండటంతో అన్ని పార్టీల దృష్టి కౌంటింగ్ కేంద్రాలపై నిలిచింది. ఈనెల 11న పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.

Next Story