- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్ షో ఆపకుండా వెళ్లడం బాధాకరం..ములుగు ఘటనపై కేటీఆర్!
ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. దీంతో పసికందు మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా

దిశ, వెబ్ డెస్క్: ములుగు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. దీంతో పసికందు మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుండగా మంత్రులు సీతక్క, పొంగులేటి వాహనాలు ఆపకుండా వెళ్లిపోయారని ఓ పత్రికలో కథనం వచ్చింది. దీనిపై ఎక్స్ వేధికగా స్పందించారు. సుధీర్ఘమైన్ పోస్టు ద్వారా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. 500కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఉపాధి కరువై బతుకు భారమై అనేక మంది నేతన్నలు, ఆటో అన్నలు ప్రాణాలు వదిలితే.. 50 మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాలతో గురుకులాల్లో మరణిస్తే...సర్కార్ భూదాహానికి నోరు లేని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతే, ఏఐ అంటూ ఎగతాళి చేసి కరగని కాంగ్రెస్ గుండెలు, కన్నెత్తి చూడని కాంగ్రెస్ నేతలు అని ఫైర్ అయ్యారు.
మచ్చుకైనా మాట్లాడని ముఖ్యమంత్రి, మంత్రులు ఒక పసిబిడ్డ ప్రాణాలు పోతే స్పందిస్తారు అనుకోవడం అత్యాశే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాధితులు కోరుకున్నది కాసింత ఓదార్పు, న్యాయం చేస్తారెమో అన్న భరోసా అని కానీ కనీసం వాహనం దిగకుండా, రోడ్ షో అపకుండా వారిని పక్కకు నెట్టేసి వెళ్లిపోవడం బాధాకరం,అవమానకరం అని పేర్కొన్నారు. అమరచింతలో జరిగిన ఘటన మరవక ముందే ములుగులో మరో ఘటన చోటు చేసుకుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి ఈ సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య తెలంగాణను ఆగం చేస్తూ-వైద్య రంగాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ పాపపు పాలకులకు ప్రజలు చరమగీతం పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ కేటీఆర్ మండిపడ్డారు.






