బండి సంజయ్‌కు కేటీఆర్ సెన్సేషనల్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-15 13:38:04  IST  )

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌(Bandi Sanjay)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భారీ షాకిచ్చారు.

బండి సంజయ్‌కు కేటీఆర్ సెన్సేషనల్ షాక్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌(Bandi Sanjay)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భారీ షాకిచ్చారు. బండి సంజయ్ కుమార్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సోమవారం సిటీ సివిల్ కోర్టు(City Civil Court)లో కేటీఆర్ దావా పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 15వ తేదీన దీనిని సివిల్ కోర్టు విచారించనున్నది. కాగా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. వైరల్‌గా మారిన ట్వీట్

Next Story