పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

by Gantepaka Srikanth |

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పేద విద్యార్థినుల విద్య సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో శుక్రవారం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సారథ్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా విద్యార్థినులతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం పెట్టుకొని.. ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని కోరారు. ఈ సందర్బంగా ల్యాప్‌టాప్‌లను అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా మరియు కర్రె ఆర్తి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Next Story