- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: నీతి, రీతి ఏమైనా ఉందా?.. దానం వ్యవహారంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటి అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) కోసం ఏఐసీసీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో (AICC star campaigners list) ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పేరు ఉండటంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఖైరాతాబాద్ బస్తీదవాఖానాను పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు నీతి, రీతి ఏమైనా ఉందా అని నిలదీశారు. అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదని ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి కరప్షన్ కు పాల్పడిందని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్యెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా బయట మరోలా వ్యవహరిస్తున్నారని.. వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. బస్తీ దవాఖానా, అంగన్ వాడీలకు వెంటనే జీతాలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కమిటీ:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతకు ఆనంద్ ఆధ్వర్యంలో కమిటీని (BRS hospital committee) ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటింటారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభఉ్తవ ఆసుపత్రులను సందర్శించి అక్కడి దుస్థితులపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు .
Read More: ‘కోపం కేసీఆర్‌పై పెంచుకోండి.. ప్రజల మీద కాదు’: సీఎం రేవంత్‌కు హరీష్ రావు సూచన






