- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: మీరు రిటైర్మెంట్ అయినా వదిపెట్టేది లేదు.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
లగచర్ల ఘటనలో పోలీసుల తీరుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఘటనలో ఎక్స్‌ట్రాలు చేసి ప్రజలను చిత్ర హింసలు పెట్టి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని లగచర్లలో మహిళలపైనా దాడులు చేశారని ఆరోపించారు. లగచర్ల భూసేకరణ సమయంలో తలెత్తిన ఘర్షణ విషయంలో పోలీసుల తీరును ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు నివేదిక తప్పుబట్టిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడురు. కొడంగల్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్లామని ఈ ఘటనపై రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలన్నారు. ఎన్ హెచ్ఆర్సీ చెప్పినట్లుగా సంబంధిత పోలీసులపై ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ ఘటనలో రేవంత్ రెడ్డి, ఆయు సోదరుడు తిరుపతి రెడ్డి పాత్ర ఉందని వాళ్లు చెబితేనే ఇదంతా జరిగిందని అనుకోవాల్సి వస్తుందన్నారు.
రిటైర్మ్ మెంట్ అయినా వదిలిపెట్టం:
లగచర్ల (Lagacharla) బాధితులను ఇంకా కొంత మంది పోలీసులు (Police) వేధిస్తున్నారని అలాంటి అధికారుల పేర్లను రాసిపెట్టుకుంటున్నామని చెప్పారు. మరో మూడేళ్లలో మా ప్రభుత్వం రాబోతున్నదని ఎవరైతే అతి చేస్తున్నారో అలాంటి అధికారులు రిటైర్మెంట్ అయి ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చి లెక్కకు లెక్క తీరుస్తామన్నారు. ఎన్ హెచ్ ఆర్సీ, కోర్టులు చెప్పినా కొంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే మీ పద్దతిలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. లగచర్ల బాధితులకు నిన్న, నేడు, రేపు కూడా అండగా ఉంటామన్నారు.వికారాబాద్ జిల్లా లగచర్లలో ఘటనలో ఎక్స్‌ట్రాలు చేసి ప్రజలను చిత్ర హింసలు పెట్టి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని లగచర్లలో మహిళలపైనా దాడులు చేశారని ఆరోపించారు. లగచర్ల భూసేకరణ సమయంలో తలెత్తిన ఘర్షణ విషయంలో పోలీసుల తీరును ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు నివేదిక తప్పుబట్టిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడురు. కొడంగల్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్లామని ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలన్నారు. ఎన్ హెచ్ఆర్సీ చెప్పినట్లుగా సంబంధిత పోలీసులపై ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే ఈ ఘటనలో రేవంత్ రెడ్డి, ఆయు సోదరుడు తిరుపతి రెడ్డి పాత్ర ఉందని వాళ్లు చెబితేనే ఇదంతా జరిగిందని అనుకోవాల్సి వస్తుందన్నారు.






