- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: బీజేపీ చెప్పిన అచ్చేదిన్ అంటే ఇదేనా?:కేటీఆర్
by Prasad Jukanti |
గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచుతూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం (NDA government) తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. అచ్చేదిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా ఎల్పీజీ సిలిండర్ (Gas cylinder) ధర రూ. 50 పెంపు, పెట్రోల్, డీజిల్ పై రూ. 2 ఎక్సైజ్ డ్యూటీని బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభఉత్వం పెంచిందని దుయ్యబట్టారు. సెన్సెక్స్ పతనంలో ఒక్కరోజులోనే 19 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయని ఇది బీజేపీ వాగ్దానం చేసిన అచ్చే దిన్ కు సంకేతమా లేక మేక్ ఇండియా గ్రేట్ అగైన్ కు ప్రారంభమా అని ప్రశ్నించారు.
Next Story






