KTR: మిర్చి రైతు కన్నీరు.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? కేటీఆర్ ఫైర్

by Ramesh N |   ( Updated:2025-02-11 06:53:54.0  )
KTR: మిర్చి రైతు కన్నీరు.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లాలో మిర్చి క్వింటాలు రూ.3 వేలకు కొంటున్నారని ఓ రైతు (Chilli farmer) కన్నీరు మున్నీరు అవుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా రైతు వీడియోను షేర్ చేశారు. గుండెలు బాదుకుంటున్నఈ రైతు గోస.. మనసులేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని, కనికరం లేని (Congress) కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

మాయమాటలు నమ్మిన పాపానికి.. మిర్చి రైతు కంట్లో కారం కొడతారా? ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా ? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా ? అని మండిపడ్డారు. ఖమ్మంలోని చింతకాని (మండలం) నావరంలో లక్షలు అప్పుచేసి ఈ రైతు మిర్చి పండిస్తే.. 2-3 వేలకే తెగనమ్మమంటారా ? అని నిలదీశారు. వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే.. గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలె.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఏం చేసుకోవాలె? అని ప్రశ్నించారు. బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపండి.. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పించండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed