- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల నిబద్ధత లేదు.. విద్య పట్ల బాధ్యత లేదు: కేటీఆర్
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నదని కేటీఆర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) నిర్లక్ష్యానికి వ్యవసాయంతో పాటు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిదంని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదని దుయ్యబట్టారు. రైతు భరోసా (Rythu Bharosa) కోసం రైతుల ఎదురుచూపులు, బాగ్ లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల గేటుకు యజమాని తాళం వేసిన ఘటనలపై దినపత్రికల్లో వచ్చిన కథనాలను కేటీఆర్ ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని, పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదని దుయ్యబట్టారు. ‘అరకొర రుణమాఫీ, ఆచూకి లేని రైతు భరోసా, అదని రైతు బీమా, ప్రాజెక్టుల పడావు’ అంటూ సెటైర్ వేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా మారితే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని ఆరోపించారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ (Telangana Education) నేడు కాంగ్రెస్ ఏడాదిన్నపాలనలో అవస్థలు ఎదుర్కొంటోందన్నారు.






