- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో/: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారు తాము పార్టీ మారామని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదని విమర్శించారు. పుంలింగం, స్త్రీ లింగం రెండు లింగాలు ఉంటాయి. కానీ సీఎం భాషలో చెప్పాలంటే పార్టీ మారిన ఎమ్మెల్యే తాము ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించినందుకు మా కార్యకర్తలు బాధ పడుతున్నారన్నారన్నారు. ఇవాళ జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారని ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పీసీసీ చీఫ్ నేరాంగీకారం చేశాక ఈ విషయంలో ఇంకా చర్చ దేనికి? ఆ పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి స్పీకర్ కు మోహమాటం దేనికి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, మీడియా, కోర్టులతో చిలిపి ఆటలాడి తప్పించుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జీవితమంతా రాజకీయాలు చేసిన పెద్దలు, మంత్రులుగా పని చేసిన వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని మీడియా అడిగితే చెప్పుకోలేని దురవస్థలో పడ్డారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో చేరానని కడియం శ్రీహరి కూడా చెప్పారు. అందువల్ల వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నందునా కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు.
కేసీఆర్ కు పేరు వస్తుందనే దురాలోచన:
కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90శాతం పూర్తి అయ్యాయని మిగతా 10 శాతం పనులకు కూడా భూసేకరణ చేశామని కేటీఆర్ చెప్పారు. ఆ 10 శాతం పనులను పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని, కేసీఆర్ పేరును ప్రజలు మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారనే దురాలోచనతో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ ప్రాజెక్టును పడావు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు.
Read More: KTR: గ్రూప్-1 లో అవకతవకలకు గట్టి చెంపదెబ్బ.. నిరుద్యోగులకు న్యాయం : తీర్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు






