జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర షురూ: కేటీఆర్ ధీమా

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-15 06:35:43  IST  )

జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha) నామినేషన్ కోసం బయల్దేరారు.

జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర షురూ: కేటీఆర్ ధీమా
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha) నామినేషన్ కోసం బయల్దేరారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు.. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని అన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతీ యువకులు సునీత గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇండ్లు కోల్పోయిన హైడ్రా బాధితులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదని జోస్యం చెప్పారు.

Read More: జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు

jubilee Hills: జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Next Story