KTR: స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీసీలకు టికెట్లు.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రమంతటా బీసీలకు టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

KTR: స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీసీలకు టికెట్లు.. మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) ఎప్పుడొచ్చినా దామాషా ప్రకారం రాష్ట్రమంతటా (BC) బీసీలకు టికెట్లు ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు పరకాలలో కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో (BRS) బీఆర్ఎస్‌ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే (CM Revanth Reddy) రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుందని అన్నారు. నిన్నైనా, రేపైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ (KCR) ఒక్కరేనని చెప్పుకొచ్చారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడి చేసిందని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన రూ. 137 కోట్లు అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో రూ. 297 కోట్లకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు రూ. 167 కోట్లు దోచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామన్నారు. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేలు బాకీ ఉందని అన్నారు. ఆడబిడ్డలకు కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో ఉద్యోగాలు వచ్చే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Next Story