- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. CM రేవంత్‌కు KTR సంచలన సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సవాల్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సవాల్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ(Telangana Assembly)లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడైనా వందశాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని ప్రకటించారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లకైనా, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌కు అయినా వెళ్దాం.. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా సరే 100% రుణమాఫీ(Rythu RunaMafi) జరిగినట్లు నిరూపిస్తే అక్కడే క్షణం ఆలోచించకుండా రాజీనామా చేస్తా అని సవాల్ చేశారు. అంతేకాదు.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే చాలా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ప్రణాళికాబద్ధమైన దృక్పథాన్ని కలిపి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. పరిపాలనలో కొత్త ఒరవడి, ప్రణాళికా రూపకల్పనలో వినూత్న విధానాలను అనుసరించడం వల్లే తెలంగాణ ముఖచిత్రం పూర్తిగా మారిందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని వివరించారు. 2014 నుంచి 2022 వరకూ రాష్ట్రాల ఆదాయాలను పరిశీలిస్తే, తెలంగాణ స్వయం సమృద్ధి కలిగిన రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ తెలిపారు.






