- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : దమ్ముంటే వారిపై అనర్హత వేటు వేయండి : కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాంగ్రెస్ నాయకుల(Congress Leaders)పై మరోసారి విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాంగ్రెస్ నాయకుల(Congress Leaders)పై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఆపార్టీ నేతలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల చేత వెంటనే రాజీనామా చేయించి, ఉపఎన్నికలకు రావాలని ఛాలెంజ్ చేశారు. కాగా నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో పార్టీ ఫిరాయింపుల కేసు(MLAs Party Defection Case) విచారణకు రాగా.. ఇంకా ఎంతకాలం ఆయా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఉంటారని ఉన్నత న్యాయస్థానం స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ వాయిదా వేసింది సుప్రీం.
ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఉద్ధేశిస్తూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతల హిపోక్రసీ మరోసారి బయట పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఒకవైపు రాహుల్ గాంధీ.. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించేలా రాజ్యాంగ సవరణ చేస్తామని ప్రచారం చేస్తారని, మరోవైపు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇతర పార్టీల నేతలకు తలుపులు తెరుస్తారని ఎద్దేవా చేశారు. తక్షణమే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి, ఉపఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. లేదా రాహుల్ తమరి అబద్దపు ఆర్భాటాలు మానుకోవాలని హితవు పలికారు.






