KTR : భారత మహిళల జట్టుకు కేటీఆర్, కవిత శుభాకాంక్షలు

by Muthe.Rajitha |

అండ‌ర్-19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(U19 T20 World Cup)లో ఘ‌న విజ‌యం సాధించి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా(Team India) మహిళల జ‌ట్టుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అభినంద‌న‌లు తెలిపారు.

KTR : భారత మహిళల జట్టుకు కేటీఆర్, కవిత శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : అండ‌ర్-19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(U19 T20 World Cup)లో ఘ‌న విజ‌యం సాధించి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా(Team India) మహిళల జ‌ట్టుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అభినంద‌న‌లు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజ‌యం, మ‌న‌ల్ని గ‌ర్వప‌డేలా చేసింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.టీమిండియా వుమెన్స్ జ‌ట్టుకు భ‌విష్యత్‌లో ఉజ్వల భ‌విష్యత్ ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. తెలంగాణ అమ్మాయి గొంగ‌డి త్రిష(Gongadi Trisha) అద్భుతంగా రాణించింద‌ని ప్రశంసించారు. టీమిండియా గెలుపున‌కు ఎంతో స‌హ‌కారం అందించిన త్రిష‌కు ప్రత్యేక అభినంద‌న‌లు చెప్పారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్న త్రిష మ్యాచ్‌ను ముందుండి న‌డిపించి విజ‌య తీరాల‌కు చేర్చార‌ని కేటీఆర్ ప్రశంసించారు.

ఎమ్మెల్సీ క‌విత అభినంద‌న‌లు...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) టీమిండియా అండ‌ర్-19 వుమెన్స్ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముద్దుబిడ్డ గొంగ‌డి త్రిష‌పై ప్రత్యేక ప్రశంస‌ల జ‌ల్లు కురిపించారు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా, ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన త్రిష‌ను ప్రత్యేకంగా క‌విత అభినందించారు. దేశానికి, తెలంగాణ‌కు ఎంతో గ‌ర్వకార‌ణం అని పేర్కొన్నారు.

అయితే మహిళల అండ‌ర్-19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్​లో భారత్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి విశ్వవిజేత‌గా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్​ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 ప‌రుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్​. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భార‌త జ‌ట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు.

Next Story