BRS: ఎర్రవల్లి ఫామ్ హౌజ్‍లో కేసీఆర్‍తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ

by Prasad Jukanti |   (  Updated:2025-10-22 07:24:01  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

BRS: ఎర్రవల్లి ఫామ్ హౌజ్‍లో కేసీఆర్‍తో కేటీఆర్, హరీష్ రావు కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్ హౌస్‍లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావుతో (Harish Rao) సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిలతో రేపు కేటీఆర్ సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార వ్యూహాలపై ఇంచార్జీలకు చేయాల్సిన దిశానిర్దేశంపై కేటీఆర్ కు అధినేత కీలక సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా ఈ భేటీలో చర్చకు రాబోతున్నట్లు సమాచారం. కాగా, జూబ్లీహిల్స్ బై పోల్ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో ఆయన ప్రచారానికి వస్తారా లేదా అనే ఉత్కంఠ గులాబీ పార్టీలో నెలకొంది.

Read More: TG: తెలంగాణలో మరో ఉప ఎన్నిక? జూబ్లీహిల్స్ తర్వాత మరో పొలిటికల్ దంగల్‍కు స్కెచ్!

Next Story