- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: అందెశ్రీ పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కీలక వ్యాఖ్యలు
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ (64) సోమవారం కన్నుమూశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ (64) సోమవారం కన్నుమూశారు. ఆయనకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ నాయకులు లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు తదితరులు ఉన్నారు. అనంతరం కేటీఆర్ అందెశ్రీ గురించి మాట్లాడుతూ.. అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తుకు చేశారు. ఆయన మరణించారు అని పద్మారావు గౌడ్ చెప్పగానే, వెంటనే నేను నా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని వచ్చాను అని తెలిపారు.
ఆయన మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.అలాగే అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, కాగా ఇవాళ ఉదయం గుండెపోటుతో అందెశ్రీ మరణించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కె.రామకృష్ణరావును ఇప్పటికే ఆదేశించారు. రేపు ఘట్ కేసస్ ఎన్ఎఫ్‍సీ నగర్ లో అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. పశువుల కాపరి నుంచి ప్రసిద్ధ కవిగా ఎదిగిన అందెశ్రీ మరణం పట్ల పలువురు ప్రముఖులు, సాహితీ వేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






