KTR: తప్పును ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నా.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

by Kema Shiva Kumar |

కులగణన (Cast Census) సర్వేలో తప్పులు దొర్లాయని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

KTR: తప్పును ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నా.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణన (Cast Census) సర్వేలో తప్పులు దొర్లాయని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే చేపట్టనున్నట్లుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Mallu Bhatti Vikramarka) బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన రీ సర్వే కొనసాగుతోందని అన్నారు. సర్వేలో గతంలో పాల్గొనని వారి కోసమే ఈ వెసులుబాటు కల్పించామని తెలిపారు. అయితే, సమగ్ర సర్వే చేపట్టిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 96.9 శాతం ప్రజలు సర్వేలో పాల్గొన్నారు. ఇంకా సర్వేలో పాల్గొనని వారు 3.1 శాతం మేర మిగిలి ఉన్నారు.

ఈ క్రమంలోనే కులగణన రీసర్వే ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సర్కారు (Congress Government) చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాల ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలోని బీసీలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసమగ్రంగా చేసిన సర్వేపై బీఆర్ఎస్‌ (BRS)తో పాటు.. బీసీ సంఘాలు ముక్త కంఠంతో అభ్యంతరం వ్యక్తం చేసినా వినకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తి లెక్కల ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ముమ్మాటికీ తప్పేనని అంగీకరించాలని అన్నారు.

రెండోసారి సర్వేను అయినా సమగ్రంగా చేయడంతో పాటు.. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. కేవలం తూతూమంత్రంగా తీర్మానం చేసి.. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుందామంటే మాత్రం బీఆర్ఎస్‌ (BRS)తో పాటు.. బీసీ సంఘాలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ (Kamareddy BC Declaration)లో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నిలబెట్టుకునే వరకు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని బీసీలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Next Story