టైంపాస్‌కే కేటీఆర్ ఏసీబీ విచారణ.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

టైంపాస్‌కే కేటీఆర్ ఏసీబీ విచారణ.. ఎమ్మెల్సీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణ ఓ టైంపాస్ చేసినట్లుగా ఉందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ విచారణకు హాజరైన రోజు ఎక్కడున్నారని ప్రశ్నించగా.. తాను జగిత్యాల (Jagityal) వెళ్లినట్లుగా సమాధామిచ్చారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ అధకారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ.. మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. హరీశ్ రావు (Harish Rao)కు ఆరోగ్యం బాగోలేదనే విషయం తనకు తెలియదని.. హాస్పిటల్‌కు కూడా వెళ్లలేదని, ఆయనకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు.

సుప్రీం కోర్టుకు వెళతా..

ఏపీ ప్రభుత్వం (AP Government) అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ (Banakacharla Project)పై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని సుప్రీం కోర్టు (Supreme Court)లో న్యాయ పోరాటం చేస్తుందని అన్నారు. గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్‌ను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుందని అన్నారు. బొల్లాపల్లి (Bollapally) జలాశయంలో నీళ్లు నిల్వ చేశాక.. అక్కడి నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించేందుకు ప్లాన్ చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్ట్‌పై కూడా తాను దేశ అతున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లుగా స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై రైల్‌రోకోతో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే.. ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ (BRS) క్యాడర్ వెంట రావడం లేదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందులో ఏమాత్రం నిజం లేదని.. ఏ నియోజకవర్గానికి వెళ్లినా కార్యకర్తలు వెన్నంటే నడుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తన వెంట రావడం లేదనేది వాస్తవమని కవిత తెలిపారు.

Next Story