- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్: కేటీఆర్
2014 నుండి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు అని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: 2014 నుండి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అన్నారు. ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు అని తెలిపారు. పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదని, వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిన మిల్ అని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజం జాహీ మిల్లు మూతపడిందని, స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని మన బిడ్డలకు కొలువులు దొరకాలనే కేసీఆర్ తపనతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందన్నారు. ఆనాడు పడ్డ బీజం ఇప్పుడు క్రమక్రమంగా ఎదిగి వస్తున్నదని, వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్‌వన్, కిటెక్స్ సంస్థలు తమతమ యూనిట్లను మొదలుపెట్టాయన్నారు.






