- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో KRMB ప్రత్యేక సమావేశం... ఆ అంశంపైనే ప్రధానంగా చర్చ?
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board 20వ సమావేశం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) 20వ సమావేశం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) అధ్యక్షతన హైబ్రిడ్ విధానం భేటీ కొనసాగనుంది. ఇందులో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొననున్నారు. బోర్డులో విధులు నిర్వర్తిస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇన్సెంటివ్‌లకు సంబంధించిన అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్పెషల్ ఇన్సెంటివ్‌లకు సంబంధించిన మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేయాలన్న అంశం రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం హైకోర్టు (High Court)కు వెళ్లగా.. దానిపై డివిజన్ బెంచ్ తీర్పు కూడా వెలువరించింది. అయితే, ఇందుకు సంబంధించి రెండు రాష్ట్రాలతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలన్న నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్న ప్రత్యేక సమావేశానికి ప్రధాన్యత నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించి బోర్డు కార్యదర్శి డీఎం రాయిపురే (DM Raipure) ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులకు అందజేశారు.






