TG: కృష్ణా జలాలపై వాదనలకు సమయం కావాలి

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 15:59:31  IST  )

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై ఢిల్లీలో జరుగుతున్న విచారణలో తమ వాదనలు ముగించడానికి మరో రోజులు సమయం కావాలని రాష్ట్ర సీనియర్ న్యాయవాది ట్రిబ్యునల్‌కు తెలిపారు.

TG: కృష్ణా జలాలపై వాదనలకు సమయం కావాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంపై ఢిల్లీలో జరుగుతున్న విచారణలో తమ వాదనలు ముగించడానికి మరో రోజులు సమయం కావాలని రాష్ట్ర సీనియర్ న్యాయవాది ట్రిబ్యునల్‌కు తెలిపారు. దీంతో ట్రైబ్యునల్ తదుపరి విచారణను ఆగస్టు 28, 29 తేదీలకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా నదీ జలాల వివాదంపై శుక్రవారం బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అయితే.. తమ వాదనలను ముగించడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. ఇప్పటికే మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూనే ఉన్నది. మరో రెండు రోజులు కోరడంతో అంగీకరించిన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆగస్టు 28,29 తేదీల్లో రాష్ట్రం తరఫున మిగిలిన వాదనలను వినిపించనున్నారు. రాష్ట్రం తరఫున వాదనలు పూర్తయిన తర్వాత ఏపీ ప్రభుత్వం తన వాదనలను ప్రారంభించనుంది. ఇరు రాష్ట్రాల వాదనలు పూర్తయ్యాక కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతున్నదనే ఉత్కంఠ నెలకొంది.

Next Story