Koti Women's: కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల ఆందోళన

by Ramesh Goud |

కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని(Koti Women's University) యూజీసీ(UGC)లో చేర్చాలని యూనివర్సిటీ విద్యార్థినులు(University Students) ధర్నా(Protest)కు దిగారు.

Koti Womens: కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని(Koti Women's University) యూజీసీ(UGC)లో చేర్చాలని యూనివర్సిటీ విద్యార్థినులు(University Students) ధర్నా(Protest)కు దిగారు. హైదరాబాద్(Hyderabad) కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ(Chakali Ailamma Women's University) విద్యార్ధులు శనివారం కళాశాలలోనే బైఠాయించారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission) లో చేర్చాలని డిమాండ్(Demand) చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా.. "గుర్తింపు లేని విద్య అన్యాయం" (Education Without Recognition Is Injustice) అని, "విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలి" అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కానీ, యూజీసీ నుండి మాత్రం విశ్వవిద్యాలయంగా గుర్తింపు మాత్రం సంపాదించలేదని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) దీనిని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందని, అయితే యూజీసీలో చేర్చకపోవడం వల్ల, చదువులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికేట్స్ ఇస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.

Next Story