- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఘనంగా కోటి దీపోత్సవం ప్రారంభం
ప్రతి ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవం ఈసారి కూడా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

దిశ, రాంనగర్: ప్రతి ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవం ఈసారి కూడా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 1వ నుండి 13వ తేదీ వరకు ఈ మహోత్సవం కొనసాగనుంది. మొదటి రోజు కార్యక్రమాలు అద్భుతమైన భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించబడ్డాయి. ప్రారంభంలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి ప్రవచనంతో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేదికపై కాశీ స్పటిక లింగానికి 108 శంఖాభిషేకం నిర్వహించగా, భక్తులు ఎంతో భక్తి భావంతో కోటి మల్లెల అర్చన చేశారు. ఈ సందర్భంగా కాలేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలు కొనసాగుతున్న వేళ శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారు విచ్చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. మొదటి రోజు ముఖ్య అతిథులుగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాసోజు సురేందర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా లు పాల్గొన్నారు. హంసవాహనంపై కాలేశ్వరం ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను ఆహ్లాదపరిచింది. చివరగా శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి వారు ఆధ్యాత్మిక సందేశంతో భక్తులకు మార్గదర్శనం చేశారు. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికత కలసిన ఈ కార్యక్రమం ప్రారంభ రోజునే విశేష ఆకర్షణగా నిలిచింది.






