- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Koppula Eshwar: తెలంగాణలో దళిత ఉద్యమం తీసుకొస్తాం
రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకొస్తామని.. కాంగ్రెస్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకొస్తామని.. కాంగ్రెస్ దళిత వ్యతిరేక ప్రభుత్వమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని.. అక్కడి దళితులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని సూచించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను అవమానిస్తున్నదని.. మల్లిఖార్జున ఖర్గేతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేసిందని.. గరిబీ హఠావో నుంచి నేటి వరకు కాంగ్రెస్ దళితులను మోసం చేస్తూనే ఉన్నదని అన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. దళితులకు ఇచ్చిన హామీలపై సీఎం, డిప్యూటీ సీఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా? అని ప్రశ్నించారు. దళితబంధు 12 లక్షలు ఇస్తామని మోసం చేశారని.. అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పార్టీ అవమానించిందని.. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం బందించిందని.. అక్కడ సీఎం, మంత్రులు నివాళులర్పించడం లేదని అన్నారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేకి అని అన్నారు. దళితబంధు సాధన సమితి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.






