‘కమలం బురదలో, చెత్తలో ఉంటది’.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-10 14:48:01  IST  )

తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘కమలం బురదలో, చెత్తలో ఉంటది’.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలం పువ్వు అనేది.. బురదలో, చెత్తలో ఉంటుంది.. మనం కూడా కమలం పువ్వులా ఎలాంటి భేదాలు లేకుండా అందరితో కలిసి పోవాలి.. కానీ వారి బురద మాత్రం అంటించుకోవద్దు అని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ సేవ చేయాలంటే ఎన్జీవో, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్‌లో జాయిన్ అవ్వాలి. రాజకీయ పార్టీలో ఉంటే.. అన్నిసార్లు కుదరదు. అన్ని పార్టీల వారిని కలుపుకొనిపోతేనే ఓట్లు వస్తాయి, అప్పుడే మనం పవర్‌లోకి రాగలుగుతాం అన్నారు. జాతీయ వాదం, దైవ భక్తి ఉంటే మంచిదే కానీ.. కొందరు బీజేపీ కార్యకర్తలు సమాజంలో అన్ని వర్గాలతో కలవడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. మాంసం తినే వారిని, మందు తాగే వారిని కొందరు పక్కన పెడుతున్నారని అన్నారు. వీళ్లకు సినిమా తెలియదు... రియల్ ఎస్టేట్ తెలియదు.. అలాంటి కార్యకర్తలతో కలిసి కనీసం చాయ్ కూడా తాగలేము అని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. వారిని కలవము, వీరిని కలవము అంటే కుదరదు.. అందరితోనూ మాట్లాడాలని అన్నారు.

కాగా, ఇటీవల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను అవమానించేలా మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ‘కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే ఉండనివ్వండి.. వారి వద్దకు నేను వెళ్లాలా?’ అని మాట్లాడారు. అంతేగాకుండా.. తనకు కార్యకర్తలతో పనిలేదని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీనిపై వివరణ ఇస్తూ మరోసారి బీజేపీ కార్యకర్తలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story