- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కడియం శ్రీహరి నల్లికుట్లోడు.. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేకపోతుండు’: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్(Warangal Congress) కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్(Warangal Congress) కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy)కి సురేఖ కౌంటర్ ఇచ్చారు. భద్రకాళీ టెంపుల్(Bhadrakali Temple) ఎవరి సొత్తు కాదు. కొందరు తమ సొత్తు అన్నట్లు ఫీల్ అవుతున్నారు. నాయిని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సరికాదు.. ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. అక్కడ యాటలు కోస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమ్మవారు శాఖాహారి అని అందరికీ తెలుసు. అక్కడ ఏళ్లుగా పనిచేస్తున్న పూజార్ల అభిప్రాయం తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకువెళ్లి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.
కడియం శ్రీహరిపై ఘాటు వ్యాఖ్యలు :
‘కడియం శ్రీహరి(Kadiyam Srihari) నల్లికుట్ల మనిషి అని.. నేను మంత్రిగా ఉంటే తట్టుకోలేపోతున్నాడు. ముఖ్యంగా నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడు. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడు. తరచూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. తెలుగు దేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్‌లో అలా నడవదు. నాకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యాను.. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. తరచూ నేను దిగిపోవాలని మాట్లాడటం సరికాదు. నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు.. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది’ అని కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు.
అంతేగాకుండా.. గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు రూ.200 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాలు ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ జరుగుతాయని.. భద్రాచల రాముడి పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూపొద్దు.. కిషన్ రెడ్డి, సంజయ్ చొరవ తీసుకోవాలని.. తెలంగాణకు పుష్కరాల నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని తీవ్ర విమర్శలు చేశారు.






