వైఎస్సార్ అంతటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి : konda surekha

by Muthe.Rajitha |   (  Updated:2025-10-27 12:54:59  IST  )

మంత్రి కొండా సురేఖ మరోసారి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.

వైఎస్సార్ అంతటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి : konda surekha
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ మరోసారి బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా, వరి వేస్తే ఉరేసుకోవాలని బెదిరించిందని విమర్శించారు. అయితే ఇటీవల కాలంలో సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కొద్దిరోజులకు అధిష్టానం ఆజ్ఞ మేరకు రేవంత్ రెడ్డికి సురేఖ క్షమాపణలు తెలిపారు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని గొప్పవ్యక్తి అంటూ కొనియాడారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులను ఆదుకున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే ఆదుకుంటున్నాడని ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి, సన్నకారు రైతులకు బోనస్ కూడా అందించినట్లు ఆమె తెలిపారు. ఈ చర్యల వల్ల తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా నిలిచిందని కొండా సురేఖ పేర్కొన్నారు.

Next Story