Konda Surekha: మహా శివరాత్రి వేడుకలు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం సమీపిస్తున్న వేళ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Konda Surekha: మహా శివరాత్రి వేడుకలు.. అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం సమీపిస్తున్న వేళ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహా శివరాత్రి Maha Shivratri) సందర్భంగా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవో (EO)లతో ఇవాళ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం (Kaleshwaram), భద్రకాళి (Bhadrakaali), తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది శివరాత్రి ఏర్పాట్ల అనుభవాల ఆధారంగా సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

ప్రధానంగా క్యూలైన్ మేనేజ్‌మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్‌, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల నుంచి మంత్రి సురేఖ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పండుగ నేపథ్యంలో శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్‌ శాఖ సమన్వయంతో ట్రాఫిక్‌ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story