- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ

దిశ, వెబ్‌డెస్క్: నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఖండించారు. తనకు కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5న విచారణకు హాజరుకావాలని కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తీవ్ర ఆవేదన చెందారు. కాగా, ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకుల వివాదం వంటి సున్నితమైన అంశాలలో మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకుని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన సురేఖ.. తప్పుడు వార్తలని కొట్టిపారేసింది.






