- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Konda Surekha : కేసీఆర్ పై కొండా సురేఖ హాట్ కామెంట్స్
మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం జరిగిన ఇండియా పాక్ మ్యాచ్(Ind-PAK Match) లో విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డ్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కాగా కోహ్లీ సాధించిన ఈ రికార్డును కేసీఆర్ తో ముడిపెట్టి సెటైర్లు వేశారు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా ఘన విజయం సాధించడం హర్షణీయం అని అన్నారు. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం అని తెలిపారు. అయితే కోహ్లీ 14 వేల రన్నులు కొట్టి రికార్డు బద్దలు కొట్టగా.. తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షనేత కేసీఆర్ కూడా అలాంటి రికార్డు బద్ధలు కొట్టారు అని అన్నారు. దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ రికార్డ్ సాధించారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలపై స్పందించకుండా.. ప్రజలకి అందుబాటులో ఉండకుండా దేశ రాజకీయ చరిత్రలో ఇదొక పెద్ద రికార్డ్ అని వ్యంగాస్త్రాలు విసిరారు. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే... 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అని హాట్ కామెంట్స్ చేశారు.






