CM రేవంత్‌కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కొండా సురేఖ(Konda Surekha) క్షమాపణలు చెప్పారు.

CM రేవంత్‌కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మంత్రి కొండా సురేఖ(Konda Surekha) క్షమాపణలు చెప్పారు. గురువారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా ఇంటికి పోలీసులు రావడంతో మా కూతురు సుష్మిత ఆవేశంతో మాట్లాడింది. మా కూతురు తరపున నేను క్షమాపణ అడుతున్నాను. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. త్వరలోనే అన్నీ సమసిపోతాయని కొండా సురేఖ స్పష్టం చేశారు.

కాగా, ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లిన విష‌యం తెలిసిందే. కొండా సురేఖ వ‌ద్ద ఓఎస్‌డీగా ప‌ని చేసిన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్ల‌డం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రి ఇంటికి వ‌స్తార‌ని ప్ర‌శ్నిస్తూ.. కొండా సురేఖ కూతురు సుస్మిత పోలీసుల‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోహిన్‌రెడ్డి మా ఇంటికి గ‌న్‌తో వ‌చ్చారు. ఆయనకు గన్ సీఎం రేవంత్ ఇచ్చారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే బీసీ మంత్రి అయిన కొండా సురేఖ‌ను సీఎం, మంత్రి పొంగులేటి, వేం న‌రేంద‌ర్‌రెడ్డి టార్గెట్ చేశారంటూ సుస్మిత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాము ఎవ‌రినీ బెదిరించ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌హారాన్ని మంత్రి కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో పాటు దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి వివరణ ఇచ్చారు. అయినా వివాదం సర్దుమణగకపోవడంతో మంత్రి సారీ చెప్పారు.

Next Story