- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా కొండా దయానంద్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండా దయానంద్‌ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొండా దయానంద్‌ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఏఐఎఫ్‌బీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ ఎం.జావెద్ లతీఫ్ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నుకున్నారు. అయితే ఏఐఎఫ్‌బీ రాజ్యాంగంలో లేని కన్వీనర్ పోస్టును ఈ సమావేశం రద్దు చేసింది. 2024 సెప్టెంబర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో 13 మందితో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అదే రాష్ట్ర కమిటీ యధావిధిగా కొనసాగనుందని శనివారం జరిగిన సమావేశం నిర్ణయించింది. రాష్ట్ర ఛైర్మన్/అధ్యక్షులు ఎం. జావేద్ లతీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టంగూరి బుచ్చి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొండా దయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.నరేందర్, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మూర్తి, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు పరంగి రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు సాగి అజిత్ కుమార్ రావు, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి శేఖర్ లు పాల్గొన్నారు.






